సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై సెక్యూరిటీ వేధింపులు

TG: గచ్చిబౌలిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ ఎక్కేందుకు వెళ్తున్న ఆమెను ఓ సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి, ఆమె అనుమతి లేకుండా ముద్దు పెట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో గార్డు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.



