← Back to news

పోలీసులమంటూ.. ఢిల్లీలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

By Lokesh· 14h ago· Indiatimes
పోలీసులమంటూ.. ఢిల్లీలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

ఢిల్లీలోని కల్కాజీ మందిర్‌ దగ్గర్లోని ఆస్తా కుంజ్‌ పార్క్‌లో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 21 రాత్రి బాలిక తన స్నేహితుడితో కలిసి గుడికి వెళ్లి, తర్వాత పార్క్‌కు వెళ్లిందని చెప్పారు. అక్కడే ఉన్న ముగ్గురు తాము పోలీసులమని చెప్పి, వారిని బెదిరించి విడదీసి ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుల్లో ఒకరు పట్టుబడ్డారని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More in Crime