ఇక్కడ 12 రోజుల్లో 4 మైనర్ గర్ల్స్‌పై ఘోరాలు!

దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 12 రోజుల్లోనే నలుగురు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరగడం షాకింగ్‌గా మారింది. కల్కాజీ, స్వరూప్ నగర్, సదర్ బజార్, కిషన్‌గంజ్ ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. స్వరూప్ నగర్‌లో 16 ఏళ్ల గర్ల్‌పై గ్యాంగ్‌రేప్ చేసి మర్డర్ చేయగా.. కల్కాజీలో పోలీసులమని చెప్పి 17 ఏళ్ల అమ్మాయిపై దాడి చేశారు. ఈ వరస ఘటనలపై పబ్లిక్ నుంచి తీవ్ర నిరసనలు రాగా, పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేసి BNS, POCSO కేసులు బుక్ చేశారు.



