కూతురిపై లైంగిక దాడి.. సహకరించిన తల్లి!

TG: HYD ఉప్పల్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు కంప్లైంట్ అందింది. బాలిక తల్లితో ఆ వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. ఆమె సహకారంతో కూతురిపై కూడా అతడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికకు గర్భం రావడంతో తల్లి, నిందితుడు కలిసి ఆమెకు ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. ఈ ఘటనను బాలిక తన అక్కకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. బాలిక కంప్లైంట్ ఆధారంగా పోలీసులు బాలిక తల్లి, నిందితుడిపై POCSO కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.



