← Back to news

కాళ్లు మొక్కుతా.. యూరియా ఇప్పించండి సారూ

By dk· 13 Aug 2026· మెదక్ జిల్లా
కాళ్లు మొక్కుతా.. యూరియా ఇప్పించండి సారూ

TG: యూరియా కోసం రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాల్సి రావడంతో స్మార్ట్‌ఫోన్‌ లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌ గ్రామానికి చెందిన రైతు బోయిని రాములు రెండు ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. పంటకు యూరియా అవసరం కావడంతో రంగంపేట సొసైటీకి చేరుకున్నారు. యూరియా ఇప్పించాలని, బస్తాకు రూ.900 చెల్లిస్తానని తనవద్ద స్మార్ట్‌ఫోన్‌ లేదని, బుకింగ్‌ చేయడం తెలియదని అటెండర్‌ భిక్షపతి కాళ్లమీద పడి వేడుకున్నాడు.

More in TG