క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ టైమ్ క్యాన్సర్ పేషెంట్ల కోసం గుంటూరు GGH నాట్కో సెంటర్‌లో రూ.2.5 కోట్లతో స్పెషల్ ల్యాబ్ అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 22న మంత్రి సత్యకుమార్ యాదవ్ దీన్ని స్టార్ట్ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో బ్రెస్ట్, లంగ్స్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఈ జెనెటిక్ టెస్టులను ఫ్రీగా చేయనున్నారు. రెండేళ్లలో 2 వేల శాంపిల్స్ టెస్ట్ లను పరీక్షించనున్నారు. ఫ్యూచర్‌లో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి జన్యు పరీక్షల కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.



