AI గేమ్‌లోకి ఎంటర్.. బెట్టింగ్ చేసేవాళ్లే Target?

అమెరికాకు చెందిన DraftKings అనే ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీపై New York Times చేసిన పరిశోధనలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. కస్టమర్లు ఎంత బెట్టింగ్ చేస్తున్నారు అనే సమాచారాన్ని AIతో పరిశీలించి.. మళ్లీ బెట్టింగ్ చేసే అవకాశం ఉన్నవారిని ఆ కంపెనీ గుర్తించినట్లు రిపోర్ట్ తెలిపింది. ఆ తర్వాత కొందరికి Free Bets, Bonuses వంటి ఆఫర్లు పంపినట్లు మాజీ ఉద్యోగులు చెప్పారు. ఇలా.. ఎక్కువగా బెట్టింగ్ చేసే వారిని గుర్తించి, మళ్లీ బెట్టింగ్ చేసేలా ఆఫర్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.


