ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో

TG: రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళలపైకి ఓవర్ స్పీడ్‌తో వచ్చిన బొలెరో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే ఇక్కడ జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



