← Back to news

బాలుడి కోరిక తీర్చిన KTR

By YSR· 1h ago· Khammam

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల వినయ్ తన అభిమాన నాయకుడు KTRను కలవాలన్న కోరిక నెరవేర్చుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వినయ్ తన కోరికను కుటుంబసభ్యుల ద్వారా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి తెలియజేశాడు. దీంతో హైదరాబాద్‌లోని ఉపేందర్ రెడ్డి నివాసంలో KTR వినయ్‌ను కలిసి ఆప్యాయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

More in Local