అంగన్వాడీల నిరసన.. గాంధీ విగ్రహానికి వినతి

గుంటూరు జిల్లా చేబ్రోలులో అంగన్వాడీలు గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహానికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల పెంపు, పెండింగ్ వేతనాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు, పనిభారం తగ్గింపు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



