అండర్ బైపాస్ నిర్మించాలని రైల్వే జీఎంకు ఎంపీ వినతి

TG: రైల్వే గేటు మూసివేసిన ప్రతిసారీ వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ రైల్వే గేటు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ గురువారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందజేశారు. రైల్వే గేటు వద్ద తరచూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ వివరించారు.



