జిమ్‌లో ఒరంగుటాన్లు.. వీడియో వైరల్
ఒడిశాలోని నందన్‌కానన్ బయోలాజికల్ పార్కులో ఒరంగుటాన్లు సందడి చేశాయి. ఇటీవల అటవీశాఖ అధికారులు వీటిని అడవిలో గుర్తించి భువనేశ్వర్ దగ్గర్లోని నందన్‌కానన్‌కి తరలించారు. అక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా ఉండటంతో ఆరోగ్యం మెరుగుపడుతోందని ఒడిశా అటవీశాఖ మంత్రి గణేశ్ రాంసింగ్ ఖుంటియా తెలిపారు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఒరంగుటాన్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి ఏ దేశానికి చెందినవో తెలుసుకునేందుకు త్వరలో DNA టెస్టులు చెయ్యనున్నారు.
