ఒక్క తప్పు.. అమెరికా డ్రీమ్‌కు బ్రేక్ వేయొచ్చా..?

"అమెరికా వెళ్లే వాళ్లకు కొత్త టెన్షన్ మొదలైందా?" ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనతో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. J-1 వీసాపై అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు వీసా కోసం తప్పుడు సమాచారం లేదా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లు తేలితే.. వారి ప్రోగ్రామ్‌ను వెంటనే రద్దు చేసేలా కొత్త రూల్‌ను ప్రతిపాదించింది. అలాంటి వారికి అమెరికా విడిచిపోవాల్సి రావొచ్చు. ఈ రూల్ అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పటికి డ్రాఫ్ట్ రూల్ మాత్రమే.



