CECని తొలగించే ప్రాసెస్ ఏంటి?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని రాష్ట్రపతి నియమిస్తారు. కానీ తొలగించడానికి చాల పెద్ద ప్రాసెస్ ఉంది. తప్పు చేసినట్లు లేదా పని చేయలేని పరిస్థితి ఉందని నిరూపిస్తేనే తొలగించే ప్రక్రియ మొదలవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధంగానే, పార్లమెంట్‌లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. రెండు సభల్లో 2/3 మెజారిటీ అవసరం. ఇప్పటివరకు ఏ CECనీ ఇలా తొలగించలేదు. కానీ ఇప్పుడు CEC జ్ఞానేష్ కుమార్‌ని అలా తొలగిస్తారా అనే చర్చ జరుగుతోంది.

