← Back to news

అక్కన్నపేటలో బీజేపీ నేతల అరెస్ట్

By A VIJAY KUMAR· 1h ago· Husnabad, Husnabad, Siddipet
అక్కన్నపేటలో బీజేపీ నేతల అరెస్ట్

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ BJYM ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి తరలివెళ్తున్న నాయకులను అక్కన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More in Local