గుక్కెడు నీళ్ల కోసం ఆదివాసీ మహిళల పాట్లు!

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ పరిధిలోని పుట్టపాడు గ్రామంలో వానాకాలంలోనూ మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని మోసుకురావాల్సి వస్తోందని శిల్ప సుశీల, సోమిల లక్ష్మి చెప్పారు. గ్రామ పెద్ద శిల్ప చెన్నారావు మాట్లాడుతూ.. పుట్టపాడుకు తాగునీటి వసతి కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.





