← Back to news

మురుగు నీటితో చెరువు కలుషితం..

By Methri Lokesh· 1h ago
మురుగు నీటితో చెరువు కలుషితం..

TG: హైదరాబాద్‌-చేవెళ్ల రోడ్డులోని పీరం చెరువు మురుగు నీటితో కలుషితమవుతోంది. చుట్టూ భారీ బిల్డిబీగ్స్, ఇళ్లు, కాలేజీలు పెరిగినా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు నేరుగా చెరువులోకి చేరుతోంది. దీంతో చెరువు కలుషితంగా మారడంతో పాటు నీటి జీవులు చనిపోతున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. చెరువుల కాలుష్యాన్ని ఇలాగే వదిలేస్తే.. భవిష్యత్తులో నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు మనకు తాగునీరు, భూగర్భ జలాల కొరత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

More in TG