← Back to news

తగ్గిన Bus Charges.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్

By Prashanth· 1h ago
తగ్గిన Bus Charges.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్

TG: హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు(RGIA) నడిచే Pushpak AC బస్సుల చార్జీలు 40% వరకు తగ్గాయి. నిన్నటి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. మియాపూర్ X రోడ్–గచ్చిబౌలి ₹350 నుంచి ₹250కి, లింగంపల్లి – ఎయిర్‌పోర్ట్‌ ₹350 నుంచి ₹200కి తగ్గింది. ఆల్విన్ X Road నుండి ₹350 ఉండగా ₹200కి తగ్గింది, కొత్తగూడ,గచ్చిబౌలి,శిల్పారామం నుంచి ₹300 ఉండగా.. ₹150కి తగ్గించారు. ఈ రూట్లలో ప్రయాణికులను పెంచేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది.

More in TG