← Back to news

దావూద్ అనుచరుడి ఆటకట్టించిన కొరియర్

By aravinda nyayapati· 2 May 2026· Mumbai
దావూద్ అనుచరుడి ఆటకట్టించిన కొరియర్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సలీమ్ డోలాను టర్కీ ప్రభుత్వం తాజాగా భారత్‌కు అప్పగించింది. ఇస్తాంబుల్‌లో అజ్ఞాతంలో ఉన్న సలీమ్ తాను ఉంటున్న ఇంటికి ఒక కొరియర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. అప్పుడు చేసిన ఫోన్ కాల్ తో ఇండియన్ పోలీసులు అతడిని గుర్తించి టర్కీకి సమాచారం అందించారు. అలా అతడు పట్టుబట్టాడు. డ్రగ్స్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్‌లో కీలక పాత్ర పోషించిన సలీమ్ ఇప్పుడు భారత ఏజెన్సీల కస్టడీలో ఉన్నాడు. అండర్ వరల్డ్ ముఠాలకు ఇది భారీ షాక్!

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.