కారును ఓవర్ టేక్ చేయబోయి కింద పడింది !!
చేతిలో మొబైల్ పట్టుకుని స్కూటర్ ను ఫాస్ట్ గా నడుపుతూ ఓ యువతి యాక్సిడెంట్ చేసేసింది. .పంజాబ్ కొట్కాపూర్ లో ఓ యువతి స్కూటర్ నడుపుతూ అటుగా వెడుతున్న కారును ఓవర్ టేక్ చేయడానికి స్పీడ్ పెంచింది. అదే టైమ్ లో మొబైల్ చేతిలో ఉండటం వల్ల ఆమె బ్రేకులు వేయలేక వెనుక టైర్ పైకి లేచి కంట్రోల్ చేయలేక కిందపడిపోయింది. ఆ వెనక వస్తున్న కారు డ్యాష్ కామ్ లో ఇదంతా రికార్డ్ అయింది. ఈ ఘటనలో ఆ యువతికి గాయాలయ్యాయి.



