← Back to news

దేశంలో సూర్యుడు ఆఖరిగా ఉదయించేదెక్కడ?

By Vishi· 18h ago
దేశంలో సూర్యుడు ఆఖరిగా ఉదయించేదెక్కడ?

మన దేశంలో సూర్యుడు మొదట ఉదయించే చోటు అరుణాచల్ ప్రదేశ్‌లోని డోంగ్ వ్యాలీ. అయితే చివరిగా.. అంటే ఆలస్యంగా ఉదయించే చోటు ఎక్కడో తెలుసా? గుజరాత్ రాష్ట్రం కచ్‌లోని గుహార్ మోతీ. ఇది దేశానికి పశ్చిమ-అంచు బిందువు. మన భూమి పశ్చిమం నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. అందువల్ల తూర్పు ప్రాంతాలకు సూర్యకిరణాలు ముందుగా చేరుతాయి. పశ్చిమ ప్రాంతాలకు చివరిగా చేరుతాయి. అందుకే అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ మధ్య సూర్యోదయ సమయంలో 1.5 నుంచి 2 గంటల వరకు తేడా ఉంటుంది.

More in Infotainment