← Back to news

గొంతులో బిస్కెట్ ఇర్రుకోని చిన్నారి మృతి

By Bala· 1h ago
గొంతులో బిస్కెట్ ఇర్రుకోని చిన్నారి మృతి

మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం సుర్తి తండాలో నిన్న రాత్రి ఆడుకుంటున్న ఏడాది చిన్నారి బిస్కెట్ గొంతులో ఇరుక్కోవడంతో మృతి చెందింది. తల్లి మౌనిక ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలకు బిస్కెట్లు ఇచ్చి వంట చేసేందుకు ఇంట్లోకి వెళ్ళింది. బిస్కెట్ గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చిన్నారి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

More in Local