APలో 6న 264 హెల్త్ Clinics!

AP: గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో కొత్త హెల్త్ క్లినిక్స్ రానున్నాయి. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో 264 విలేజ్ హెల్త్ క్లినిక్స్ 103.16 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త క్లినిక్స్ ప్రారంభానికి రెడీ అయ్యాయి. ఈనెల 6న కృష్ణా జిల్లా జనార్దనపురం నుంచి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వీటిని లాంచ్ చేయనున్నారు. ఇతర జిల్లాల్లోని హెల్త్ క్లినిక్స్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ క్లినిక్స్‌లో 105 రకాల మెడిసిన్స్, 14 రకాల హెల్త్ టెస్టులు, 71 రకాల మెడికల్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉంటాయి.

