135 ఏళ్ల నాటి సెంట్రల్ లైబ్రరీకి చోటు లేదా?

ఢిల్లీలో 135 ఏళ్ల నాటి చారిత్రాత్మక సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపుపై సుప్రీంకోర్టు స్వయంగా స్పందించింది. కొత్త సెంట్రల్ విస్టా ప్లాన్‌లో 8.5 లక్షలకు పైగా పుస్తకాలున్న ఈ ప్రతిష్టాత్మక లైబ్రరీకి చోటు లేకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. ఈ ఇష్యూపై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాల బెంచ్ రేపు అత్యవసర విచారణ జరపనుంది.


