← Back to news

నక్షత్రాలు ఏ రంగులో ఉంటాయి?

By Vishi· 17h ago
నక్షత్రాలు ఏ రంగులో ఉంటాయి?

మనం ఆకాశంలోకి చూసినప్పుడు నక్షత్రాలన్నీ మెరుస్తుంటాయి. అయితే నక్షత్రాల రంగులన్నీ ఒకేలా ఉండవు. నీలం, తెలుపు, పసుపు, నారింజ, ఎరుపు.. ఇలాంటి రంగుల్లో ఉంటాయి. నక్షత్రం ఉపరితల ఉష్ణోగ్రత దాని రంగును నిర్ణయిస్తుంది. ఇది ‘blackbody radiation’ అనే థియరీ మీద ఆధారపడి ఉంటుంది. చాలా వేడి నక్షత్రాలు, అంటే 25,000–40,000 K (Kelvin – వేడిని కొలిచే పరిమాణం) ఉంటే నీలం, మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఉంటే తెలుపు, ఇంకాస్త తక్కువ వేడివి పసుపు, చల్లనివి నారింజ, ఇంకా చల్లనివి ఎరుపు రంగులో ఉంటాయి.

More in Infotainment