TGSRTCలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకి వెళుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, చర్చలకు కూడా ఆర్టీసీ అధికారులు గైర్హాజరయ్యారని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, గత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణ బకాయిల అమలు, ఖాళీల భర్తీ, ఆర్టీసీ వాడుకున్న ఉద్యోగుల పీఎఫ్ తిరిగి వారి ఖాతాలో వేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి.



