పబ్లిక్‌గా యూరినేట్.. బీజేపీ MLAను ప్రశ్నించిన యువకుడు!
కర్ణాటక బీజేపీ MLA మునిరత్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని సదాశివనగర్‌లో ఖాళీ స్థలం వద్ద MLA పబ్లిక్‌గా యూరినేట్ చేస్తుండగా ఓ యువకుడు ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ‘నన్ను అడగడానికి నువ్వెవరు?’ అంటూ తన తల్లిని MLA తిట్టారని యువకుడు ఆరోపించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
