సైబర్ క్రైమ్స్ పై అవేర్నెస్

సైబర్ నేరాలపై ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఖమ్మం జిల్లా మర్లపాడు SBI బ్రాంచ్ డిఫరెంట్గా ప్లాన్ చేసింది. శనివారం గ్రామంలోని సెంటర్లో కళాజాత టీమ్తో పాటలు, డప్పు దరువులతో సైబర్ ఫ్రాడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన టిప్స్ వివరించారు. దసరా గిఫ్ట్ వచ్చింది OTP చెప్పండి అంటే నమ్మొద్దని, అన్-అథరైజ్డ్ యాప్స్ వాడొద్దని, ప్యాన్/ఆధార్ డిటైల్స్ ఎవరికీ ఇవ్వొద్దని అలర్ట్ చేశారు. ఈ అవేర్నెస్ ఈవెంట్లో లోకల్స్తో పాటు హమాలీ కార్మికులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.



