సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్.. సంస్థల సహకారం

TG: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకం అమలుకు Junna Solar Systems, Chain Labs India సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్‌తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. CM Revanth Reddy సమక్షంలో Junna Solar 5 కోట్ల 17 లక్షల రూపాయలు, Chain Labs 4 కోట్ల రూపాయలు అందించాయి. నవంబర్ 30లోపు ఏర్పాట్లు పూర్తి చేసి, డిసెంబర్ 9న కిచెన్లు ప్రారంభించాలని CM ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, ఆహార నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు.



