పెరగనున్న ఆటో ఛార్జీలు..

TG: ఆటోలో వెళ్లేవాళ్లకు త్వరలో ఛార్జీలు పెరగొచ్చు. ఆటో రేట్లు పెంచాలని రవాణా కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. కొత్త రేట్ల ప్రకారం.. మొదటి 1.6 కిలోమీటర్లకు 20 రూపాయల బదులు 30 రూపాయలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు 11 రూపాయల బదులు 14 రూపాయలు చెల్లించాలి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జీ 1.5 రెట్లు ఉండొచ్చు. వెయిటింగ్ ఛార్జీ నిమిషానికి 75 పైసలు, సామాను ఒక్కో ప్యాకేజీకి 50 పైసలు ఉండొచ్చు. అయితే ప్రభుత్వం అంగీకరిస్తేనే ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.



