← Back to news

తల్లి కోసం వెళ్లి.. రెండు నిండుప్రాణాలు బలి

By Vishi· 1h ago· Ndtv
తల్లి కోసం వెళ్లి.. రెండు నిండుప్రాణాలు బలి

నోయిడా బస్సు అగ్నిప్రమాదం తల్లి, కొడుకుల్ని బలిదీసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఆ బస్సులో ఉన్న సునీత నడవడం కష్టం. దీంతో బస్సు చివరి సీటులో కూర్చున్నారు. మంటలు రాగానే ఆమె కొడుకు శశాంక్ తల్లిని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమెను కదపలేకపోయాడు. పొగ, మంటల వల్ల ఇద్దరూ తీవ్రంగా కాలిపోయి మరణించారు. ఏసీ సిస్టమ్‌లో పేలుడు వల్ల మంటలు వచ్చాయని విచారణలో తేలింది.

More in National