Gen Z, Gen Alphaకు నిర్మలా సీతారామన్ కీలక సూచనలు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. Gen Z, Gen Alpha యువత దేశ భవిష్యత్తుకు లీడర్‌షిప్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకుని బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత కొత్త ఆలోచనలు, స్కిల్స్‌తో ముందుకు రావాలని అన్నారు. దేశ అభివృద్ధిలో యూత్ చాలా కీలకమని, లీడర్లుగా ఎదిగి సొసైటీకు ఉపయోగపడేలా పనిచేయాలని కోరారు. చెన్నైలోని డా. M.G.R. ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 36వ కాన్వొకేషన్ సెరిమనీలో ఆమె ఈ కామెంట్స్ చేశారు.



