← Back to news

తల్లి ఆశీస్సులు తీసుకున్న సి.వి. ఆనంద్ !!

By DS· 3 May 2026· Hyderabad
 తల్లి ఆశీస్సులు తీసుకున్న సి.వి. ఆనంద్ !!

తన కుమారుడు డీజీపీ అయితే చూడాలని కలలు కన్న ఆ కన్నతల్లి కోరిక నెరవేరింది. తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ తల్లి తన కొడుకు డీజీపీ పదవిలో చూడాలని తపన పడ్డారు. అయితే జనవరి నుంచి తీవ్ర అనారోగ్యం పాలైన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సి.వి. ఆనంద్ అదే హోదాలో వెళ్లి తన తల్లి ఆశీస్సులు అందుకున్నారు. మంచానికే పరిమితమైన ఆమె కళ్లలో సంతోషం చూసి సంబర పడ్డారు. ఆ కోరికే ఆమెను కోలుకునేలా చేసిందని ఆనంద్ సంతోషంతో తెలిపారు.

More in News