← Back to news

తాడిపత్రిలో చెలరేగుతున్న మైనర్లు !!

By DS· 13 Apr 2026· Telugu Report· visakhapatnam

తాడి పత్రిలో మైనర్ లు చెలరేగుతున్నారు. పబ్లిక్ హడలి పోయేలా బైకుల మీద స్టంట్లు చేస్తున్నారు. అదీ సాయంత్రం వేళ.. రద్దీ పెరిగే టైములో నడి రోడ్డుపై బైకులను గాల్లోకి లేపి స్పీడుగా నడుపుతూ కేరింతలు కొడుతున్నారు. ఒకడిని చూసి మరొకడు ఈ చేష్టలు చేస్తుంటే చూస్తున్న వారికి చిరాకు పుట్టింది. ఎట్టకేలకు పోలీసులు చూసి బైకులు సరెండర్ చేసుకుని ఈ పొగరెక్కిన కుర్రకారుకి ఓ స్ట్రాంగ్ క్లాసు తీసుకున్నారు. ఇలా అయితే ఎలా అని పేరెంట్స్ ని పిలిచి మరీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.