పండగ సీజన్‌లో 16 స్పెషల్ ట్రైన్స్: SCR

పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు మధ్య 16 స్పెషల్ ట్రైన్ సర్వీసులు నడపనుంది. ఈ రైళ్లు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు సాగిస్తాయి. 07037 నంబర్ రైలు చర్లపల్లి నుంచి, 07038 రైలు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయల్దేరుతాయి. నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.



