వయోవృద్ధులకు మెడికల్ క్యాంపు.. హెల్ప్లైన్ 14567!

పెద్దపల్లి జిల్లా మంథనిలో వయోవృద్ధులకు మెడికల్ క్యాంపు జరిగింది. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా ప్రణామ్ డే కేర్ సెంటర్లో ఈ క్యాంపు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీనిజ కోహిర్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపులో బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. సమస్యలు ఉంటే 14567 హెల్ప్లైన్కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సూపరింటెండెంట్ రాజయ్య, CDPO పుష్పలత, FRO స్వర్ణలత, డాక్టర్ శ్రీవాణి పాల్గొన్నారు.


