← Back to news

కాకరవాయిలో గ్రామసభ.. పలు అభివృద్ధి పనులపై చర్చ

By Yellimalla Srinivasarao· 1h ago· Pinampally, Tirumalayapalem, Khammam
కాకరవాయిలో గ్రామసభ.. పలు అభివృద్ధి పనులపై చర్చ

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో సర్పంచ్ గూడూరు ఉపేంద్ర అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు రైతులకు ఉపాధి కల్పించే అంశాలపై సమావేశంలో చర్చించారు. రైతులకు 375 పనుల ద్వారా 125 రోజుల పని కల్పించడం, భూగర్భ జలాలను ఒడిసిపట్టే చర్యలు, ఫారం పండ్లు, జలసిరి కుంటల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ చేపట్టడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాకరవాయిలో గ్రామసభ.. పలు అభివృద్ధి పనులపై చర్చ

More in Local