ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ

TG: హైదరాబాద్ IS సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ATM క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ తన కుమారుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న సంతోష్‌నగర్ SBI ATMలో కస్టోడియన్లు, గన్‌మెన్ నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ రూ.17లక్షలు ఉన్న బ్యాగ్‌తో పరారయ్యాడు. డ్రైవర్ శ్రీనివాస్ కనిపించకపోవడం, బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, బైక్‌పై వెళ్ళింది తండ్రి కొడుకులుగా నిర్ధారించారు.



