రాత్రికి రాత్రే భారీ చోరీ

AP: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామానికి చెందిన రైతుల పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటర్ స్టార్టర్లను దొంగలు చోరీ చేశారు. ఒకేరాత్రి 29 స్టార్టర్లు చోరీకి గురైనట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు స్టార్టర్ బాక్సులు ఖాళీగా ఉండడం, విడిభాగాలు పొలంలో చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు. బాధిత రైతులు ఫోన్‌లో ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



