← Back to news

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై BRS నిరసన

By Ashok Ganapuram· 1h ago· Warangal
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై BRS నిరసన

TG: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరిలో BRS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు నేతృత్వంలో ర్యాలీ, రాస్తారోకో, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాజేశ్వర్‌రావు విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో BRS విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More in Local