← Back to news

మమతకు మరో షాక్.. 20 మంది TMC MPలు NDAకి మద్దతు !

By AR· 8 Jun 2026· Ndtv
మమతకు మరో షాక్.. 20 మంది TMC MPలు NDAకి మద్దతు !

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటివరకు 58 ఎమ్మెల్యేలు ఆమెకి వ్యతిరేకంగా గళమెత్తితే ఇప్పుడు ఎంపీల వంతు వచ్చింది. షర్మిలా సర్కార్ నేతృత్వంలో సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఈ రెబెల్ ఎంపీలంతా కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వీరంతా ఒక కూటమిగా ఏర్పడి NDAకి మద్దతు ఇస్తూ లోక్ సభ స్పీకర్ కు లేఖ పంపారు. ఈ విషయాన్ని షర్మిళ NDTV చానెల్ కి చెప్పారు. ఈ పరిణామాలతో పార్టీ మరింత సంక్షోభంలో పడింది.

More in Politics