భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. నాయకులు అరెస్ట్

TG: వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకుంది. రాజకీయ సవాళ్లు, ఆరోపణల కోసం BRS, కాంగ్రెస్ నేతలు పవిత్రమైన భద్రకాళి దేవాలయాన్ని వాడుకోవడంపై BJP నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తడిబట్టలతో వచ్చి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, ఆలయాన్ని రాజకీయాలతో అపవిత్రం చేశారని BJP నేతలు ఫైరయ్యారు. ఆలయ పరిసరాలను శుద్ధి చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.