← Back to news

గుంటూరులో మర్డర్ చంపింది లాయరే!

By sahani· 15 Apr 2026· Telugu Report· Guntur
గుంటూరులో మర్డర్ చంపింది లాయరే!

గుంటూరులో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు. లాయర్ సురేశ్ తన ఫ్రెండ్‌తో కలిసి ఈ మర్డర్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరించాడు. బాధితురాలికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని సురేశ్ 25 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత డబ్బుల విషయంలో గొడవలు రావడంతో, ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు. శ్రీశైలం వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, తలపై కర్రలతో కొట్టి చంపేసి బాడీని కాలువలో పడేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.