← Back to news

కాఫీ దినోత్సవం.. సుంకరమెట్టలో అవగాహన!

By B V Appalanaidu· 51m ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
కాఫీ దినోత్సవం.. సుంకరమెట్టలో అవగాహన!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సుంకరమెట్ట కాఫీ ఉడ్డ్ బ్రిడ్జి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన విద్యార్థులు కాఫీ తోటలను సందర్శించారు. సాగు విధానం, మొక్కల పెంపకం, కాఫీ ప్రాధాన్యతపై అవగాహన పొందారు. కాఫీ బోర్డు ప్రతినిధులు గిరిజనులకు అందిస్తున్న సేవలను వివరించారు.

More in Local