← Back to news

KTRకు నోటి దురుసు ఎక్కువ: కాల్వ సుజాత

By A.Ajay· 2h ago
KTRకు నోటి దురుసు ఎక్కువ: కాల్వ సుజాత

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత విమర్శలు చేశారు. E-Car రేసు కేసు చిన్నదేనని చెబుతున్న KTR.. కోర్టులో ఎందుకు పోరాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 54 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయని నిలదీశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, C.E.C. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.

More in TG