‘హిందీ నేర్చుకో.. లేదా జాబ్ మానేయ్’.. బెంగళూరులో ఘటన

‘కన్నడలో మాట్లాడు.. లేదా జాబ్ మానేయ్’ అంటూ ఓ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చిన ఘటన కర్ణాటకలో జరిగింది. మదనాయకనహళ్లిలో ఉన్న జోమాటో వేర్‌హౌస్‌లో అశోక్ ముత్తయ్య షిఫ్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనది ఆంధ్రప్రదేశ్. అశోక్ కన్నడ ఉద్యోగులతో హిందీలో మాట్లాడుతుండగా “కన్నడలో మాట్లాడండి” అని ఓ ఎంప్లాయ్ అడిగాడు. అందుకు అశోక్ “హిందీ నేర్చుకోండి. లేదంటే ఉద్యోగం వదిలేయండి” అని చెప్పాడని ఆరోపిస్తున్నారు. అశోక్‌పై చర్యలు తీసుకోవాలని కన్నడ సంఘాల వాళ్లు డిమాండ్ చేశారు.
