← Back to news

దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరణ

By PENCHALAIAH· 2h ago· Y.S.R. Kadapa
దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరణ

AP : కడప జిల్లా ఎర్రగుడిపాడు శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్‌‌లోకి SC సామాజిక వర్గానికి చెందిన చంద్ర, తన పిల్లలతో కలిసి వెళ్లగా మాజీ సర్పంచ్ ఏనుగు బ్రహ్మానంద రెడ్డి అడ్డుకున్నారు. దళితులు గుడిలోకి వస్తే అపవిత్రం అవుతుందని పరుష పదజాలంతో దూషించారు. ఆయనతో పాటు గుడికి తాళాలు వేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవాలని అఖిలభారత అంబేద్కర్ సేన డిమాండ్ చేసింది. దళితుల హక్కులను కాపాడాలని కోరుతుంది.

More in AP