జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ధర్నా
TG: CEC జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిరసన స్టార్ట్ అయ్యింది. SIR ప్రక్రియలో అవకతవకలపై వచ్చిన రిపోర్ట్‌తో నిరసన వెల్లువెత్తింది. నిరసనకారులు ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరసన కొనసాగుతుంది. “ఓటు హక్కుపై జరిగిన దాడికి వ్యతిరేకంగా లేవండి. SIRను వ్యతిరేకించి, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరండి” అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
