నీళ్ల కోసం బిందెలు.. బతుకు కోసం అప్పులు

మహారాష్ట్రలో కరువు మహిళా రైతుల జీవితాలను కష్టంగా మార్చేసింది. బీడ్, జాల్నా, లాతూర్ ప్రాంతాల్లో బోర్‌వెల్స్, వాటర్ సోర్సెస్ ఎండిపోవడంతో మహిళలు ఉదయాన్నే నీటి కోసం కిలో మీటర్ల దూరం నడుస్తున్నారు. నీళ్లు తెచ్చిన తర్వాత పొలం, కూలీ పనులకు వెళ్తున్నారు. పంటలు దెబ్బతినడంతో ఇన్‌కమ్ తగ్గి, ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం 265 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.