← Back to news

సూపర్‌వుమన్‌గా నటించాలనేది నా కోరిక!

By A.Ajay· 3h ago
సూపర్‌వుమన్‌గా నటించాలనేది నా కోరిక!

నేషనల్ అవార్డు గెలుచుకున్న కృతిసనన్ భిన్నమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ‘సూపర్‌వుమన్’ పాత్రలో నటించాలనేది తన కోరిక అని చెప్పారు. అలాగే పూర్తిగా నెగెటివ్ పాత్రలో తన నటనను చూపించాలని ఉందన్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితమైన సూపర్‌హీరో కథల్లో మహిళలకు అవకాశాలు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ‘మిమి’, ‘దో పత్తి’ సినిమాల్లో విభిన్న పాత్రలు చేసిన కృతి, భవిష్యత్తులో మరిన్ని కొత్త తరహా పాత్రలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

More in Entertainment